సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ “కూలీ”కి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న అనిరుధ్ రవిచందర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేశాడు.
ఆయన చెప్పిన ప్రకారం – “కూలీ” సినిమాలోని ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ సహాయం తీసుకున్నట్లు వెల్లడించాడు. “మేము ఒక రిఫరెన్స్ ట్యూన్ తయారు చేయాలన్న ఐడియాతో మొదలుపెట్టాము. దానికి బేస్‌గా AI సహాయం తీసుకున్నాం. దాన్ని మన స్టైల్‌లో మానవీయంగా మలిచాం” అంటూ అనిరుధ్ తెలిపారు.
ఇప్పటికే అనిరుధ్ మ్యూజిక్‌కి యూత్‌లో క్రేజ్ అమితంగా ఉంది. కానీ ఈసారి రజనీకాంత్ లాంటి లెజెండరీ నటుడితో చేయబోయే సినిమాకు, టెక్నాలజీ టచ్‌తో మాస్ మ్యూజిక్ ఇవ్వాలని అనుకున్నట్టుగా అనిపిస్తోంది.
అల్రెడీ “కూలీ” టైటిల్ రివీల్ వీడియోకి భారీ రెస్పాన్స్ రావడంతో పాటలపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి AI+అనిరుధ్ కలయికలో వచ్చిన మ్యూజిక్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

