శ్రీదేవి ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయిందా?

VN:F [1.9.22_1171]
Rating: 5.5/10 (2 votes cast)

శ్రీదేవి ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయిందా?

సినిమా ఇండస్ట్రీలో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు ఇట్టే అయిపోతుంటాయి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సంపాదించుకున్నదంతా తుడిచిపెట్టుకుపోతుంది. అందాలతార శ్రీదేవి పరిస్థితి కూడా ఇప్పుడిలాగే వుందని వార్తలొస్తున్నాయి. ఆమె ఫ్యామిలీ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో వుందని అంటున్నారు. శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్ ఇద్దరూ కూడా ఎంతగానో సంపాదించినవారే. అయితే, ఇటీవలి కాలంలో ఆదాయం లేకపోవడం, బోనీ మొదలెట్టిన రెండు సినిమాలు ముందుకు కదలకపోవడంతో అప్పులపాలయ్యారని తెలుస్తోంది. ఆదాయం లేకపోయినా, శ్రీదేవి ఇప్పటికీ స్టార్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ, విపరీతమైన ఖర్చుకి అలవాటుపడిపోవడంతో ఆర్ధికంగా చితికిపోయారని అంటున్నారు.
ఏభయ్యవ పడిలో పడినా.. సౌందర్యాన్ని మెయింటైన్ చేయడానికి శ్రీదేవి తెగ తాపత్రయపడుతుందనీ, దాంతో వారానికి రెండుసార్లు బ్యూటీ పార్లర్స్ కి వెళుతుందనీ సమాచారం. వీరి నెలసరి ఖర్చు పదిహేను, ఇరవై లక్షల వరకు ఉంటోందని బాలీవుడ్ వర్గాల కథనం. ఒక పక్క అప్పుల సమస్య, మరోపక్క దమ్మిడీ ఆదాయం లేకపోవడంతో బోనీకపూర్ ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నాడని అంటున్నారు. అరవైకి దగ్గరలో వున్న ఈ వయసులో ఓ టీవీ చానెల్ కి సీఈవో గా ఆయన వెళుతున్నట్టు తెలుస్తోంది. అలాగే, శ్రీదేవి కూడా ఆర్టిస్టుగా వచ్చిన ఆఫర్లను యాక్సప్ట్ చేయాలనే ఆలోచనలో వుందట. ఏమైనా, శ్రీదేవి ఉదంతం సినిమా వాళ్లందరికీ  మరోసారి కనువిప్పు కావాలి!

Tags : Old Atress Srudevi, Sridevi Family in Debts, Sri Devi Maintanance Cost 10 Lacks Per Month, Sri Devi boni Kapoor ion Debts, Boni Kapoor Looking for a job Now, Sri Devi Reentry to Movies, Sri Devi Family in Debts

VN:F [1.9.22_1171]
Rating: 5.5/10 (2 votes cast)
శ్రీదేవి ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయిందా? , 5.5 out of 10 based on 2 ratings

Short URL: http://kasepu.com/?p=23113

Posted by on 11:02. Filed under సినిమా. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Photo Gallery

All Rights Reserved Kasepu.Com