ఆటోబయోగ్రఫీ రాస్తున్న షారుక్ ఖాన్

VN:F [1.9.22_1171]
Rating: 0.0/10 (0 votes cast)

ఆటోబయోగ్రఫీ రాస్తున్న షారుక్ ఖాన్
గత కొన్నేళ్లుగా రాస్తున్న తన ఆటోబయోగ్రఫీ పూర్తికావచ్చిందనీ, త్వరలోనే దీనిని విడుదల చేస్తాననీ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ చెబుతున్నాడు. ఈ పుస్తకానికి ‘ఒక దశాబ్దంలో ఇరవై ఏళ్లు’ అనే పేరు పెట్టాడు. 1991 నుంచి 2001 మధ్య కాలంలోని పదేళ్ళ వ్యవధిలో ఇరవై ఏళ్ల జీవితాన్ని గడపగలిగాననీ, ఆ కాలం నాటి విషయాలే ఇందులో ఉంటాయనీ, అందుకే దీనికి ఆ పేరు పెడుతున్నాననీ చెప్పాడు.                   తనలాగానే ఈ పుస్తకం కూడా సరదాగా ఉంటుందనీ, తన జీవితంలో చోటు చేసుకున్న ఫన్నీ సంఘటనలన్నీ ఇందులో ఉంటాయని షారుక్ చెప్పాడు. తన వ్యక్తిగత విషయాలతో బాటు జర్నలిస్టుల మీద కూడా ఒక చాప్టర్ రాశానన్నాడు. ఈ పుస్తకంలో తనకిష్టమైన చాప్టర్లలో ఒకటి తన తల్లిదండ్రుల మీద రాసిన ఎనిమిది పేజీల అధ్యాయమని తెలిపాడు. ఏమైనా, షారుక్ ఎవరి గురించి ఏం రాశాడోనని బాలీవుడ్ ప్రముఖులంతా ఆసక్తిగా వున్నారు.

Tags : Shah Rukh Khan, Shahrukh Khan Latets News, Shahrukh Khan Auto Biography

VN:F [1.9.22_1171]
Rating: 0.0/10 (0 votes cast)

Short URL: http://kasepu.com/?p=20614

Posted by on 23:37. Filed under Actors, Hindi, Telugu, సినిమా. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Photo Gallery

All Rights Reserved Kasepu.Com