ఆ పాత్ర వేయాలంటే గట్స్ ఉండాలట!

VN:F [1.9.22_1171]
Rating: 0.0/10 (0 votes cast)

ఆ పాత్ర వేయాలంటే గట్స్ ఉండాలట!


శ్రియ అందగత్తే కాదు… గట్స్ కూడా వున్న వీర వనితట. ఈ విషయాన్ని తనే చెబుతోంది. ‘ఈ సినిమా చేయాలంటే గట్స్ వుండాలి. అందరూ చేయలేరు. ఆ దమ్ము నాకుంది కాబట్టే ఈ సినిమా చేయగలుగుతున్నాను’ అంటోంది శ్రియ గర్వంగా. ఇంతకీ… తను చెబుతున్నది తాజాగా చేస్తున్న ఓ తమిళ సినిమా గురించి. ఇందులో తను వేశ్య పాత్ర పోషిస్తోంది. సినేమాలేమీ లేకే శ్రియ ఇటువంటి పాత్రలు ఒప్పుకుంటోంది… అంటూ కొంత మంది చేస్తున్న కామెంట్లను దృష్టిలో పెట్టుకుని తానిలా అంటోంది.
అసలింత మంచి పాత్ర దొరకడం తన అదృష్టమనీ, ఇది తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుందనీ చెబుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నయ్ లో జరుగుతోంది. కోల్ కతాలోని రెడ్ లైట్ ఏరియా సోనాగంజ్ ను తలపించే రీతిలో ఓ భారీ సెట్ వేసి మరీ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా తనకి అవార్డులు కూడా తెచ్చిపెడుతుందని శ్రియ ఆశగా వుంది.

Tags : Shriya As Prostitute, Shriya Saran, Actress Shriya Latest  News

VN:F [1.9.22_1171]
Rating: 0.0/10 (0 votes cast)

Short URL: http://kasepu.com/?p=20620

Posted by on 23:43. Filed under Actress, Tamil, Telugu, సినిమా. You can follow any responses to this entry through the RSS 2.0. You can leave a response or trackback to this entry

Photo Gallery

All Rights Reserved Kasepu.Com