Category archives for: సినిమా

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘బాబా సాయిబాబా’

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘బాబా సాయిబాబా’ పుట్టపర్తి సత్యసాయిబాబా జీవితకథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఓ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. చేగొండి హరిరామజోగయ్య నిర్మించే ఈ చిత్రం షూటింగ్ గురు పౌర్ణమి రోజున ప్రారంభమవుతుందని దర్శకుడు రామకృష్ణ ఈ రోజు పుట్టపర్తిలో మీడియాకు తెలియజేశారు. సత్యసాయి ట్రస్ట్ సభ్యులను కలిసి, బాబాకు సంబంధించిన పలు వివరాలు సేకరించడానికి నిర్మాతతో కలిసి ఆయనీ రోజు పుట్టపర్తి చేరుకున్నారు. అనుకున్న ప్రకారం ట్రస్ట్ [...]

శృతిహాసన్ కల ‘నిజమా’యేనా?

శృతిహాసన్ కల ‘నిజమా’యేనా? ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా ద్వారా కుందనపు బొమ్మగా ప్రేక్షకులకు దర్శనమిచ్చిన శృతి హాసన్ కి ఈమధ్య ఓ కల వచ్చిందంట. అది అలాంటి ఇలాంటి కల కాదు. ఈ అందాలబొమ్మను కంగారుపెట్టేసిన కల. కుదురు లేకుండా చేసిన కల! ఆ కలలో తానొక దొంగట. ఇతర దొంగలతో కలిసి వెళ్లి ఓ పెద్ద బ్యాంకును కొల్లగొట్టేస్తున్నట్టుగా  కలవచ్చిందట. దాంతో కంగారుపడిపోయిన శృతి… అసలీ కల ఎందుకొచ్చిందబ్బా?  అంటూ ఆలోచించిందట. ఒక యాక్షన్ [...]

నేటి సినిమా వార్తలు…టూకీగా 22-06-2011

నేటి సినిమా వార్తలు…టూకీగా  22-06-2011 *  జూలై 1, 2, 3 తేదీల్లో అమెరికాలోని న్యూజెర్సీలో జరిగే NATS (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఉత్సవాల్లో హీరో రామ్ చరణ్ తో బాటు హీరోయిన్లు ప్రియమణి, బిందుమాధవి, మధుశాలిని కూడా పాల్గొంటున్నారు. *  బి.వి.రమణారెడ్డి దర్శకత్వంలో కమల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘సంచలనం’ చిత్రం ఆడియోను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి పాటల సీడీని విడుదల చేయగా, నటుడు సాయికుమార్ తొలి సీడీని అందుకున్నారు. *  నేపధ్య [...]

యన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ సినిమా

యన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ సినిమా యన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో క్రియేటివ్స్ కమర్షియల్స్ బ్యానర్ పై అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్న చిత్రం మూడో షెడ్యుల్ షూటింగ్ జూలై ఒకటి నుంచి హైదరాబాదులో జరుగుతుంది. ఇంతవరకు పదమూడు రోజుల షూటింగ్ జరిగిందని దర్శకుడు బోయపాటి చెప్పారు. యన్టీఆర్, శృతి హాసన్ లపై రొమాంటిక్ సీన్లు; యన్టీఆర్, రాహుల్ దేవ్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్; యన్టీఆర్, కోట, బ్రహ్మానందం, అలీ లపై కామెడీ సీన్లు చిత్రీకరించినట్టు [...]

ఎగస్ట్రాలు పోతున్న నిత్యామీనన్

ఎగస్ట్రాలు పోతున్న నిత్యామీనన్ మల్లూ బేబీ నిత్యా మీనన్ తెలియక ప్రవర్తిస్తోందో లేక తెలిసే అలా ప్రవర్తిస్తోందో తెలియదు కానీ, ఆమె ప్రవర్తన మాత్రం ‘టూ మచ్’ గా ఉందనే చెప్పాలి. ఇంతవరకు ఏ హీరోయిన్నూ మాట్లాడని రీతిలో తను లూజ్ గా మాట్లాడుతూ పలువుర్ని హర్ట్ చేస్తోంది. ఆమెకు ఎగస్ట్రాలు కాస్త ఎక్కువే అని ఇంతకు ముందు టాలీవుడ్ లో ఆ నోటా ఈ నోటా విన్నప్పటికీ, నిన్న ’180′ సినిమా ప్రెస్ మీట్లో తెలుగు [...]

శ్రీదేవి ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయిందా?

శ్రీదేవి ఫ్యామిలీ అప్పుల్లో కూరుకుపోయిందా? సినిమా ఇండస్ట్రీలో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు ఇట్టే అయిపోతుంటాయి. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా సంపాదించుకున్నదంతా తుడిచిపెట్టుకుపోతుంది. అందాలతార శ్రీదేవి పరిస్థితి కూడా ఇప్పుడిలాగే వుందని వార్తలొస్తున్నాయి. ఆమె ఫ్యామిలీ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో వుందని అంటున్నారు. శ్రీదేవి, ఆమె భర్త బోనీకపూర్ ఇద్దరూ కూడా ఎంతగానో సంపాదించినవారే. అయితే, ఇటీవలి కాలంలో ఆదాయం లేకపోవడం, బోనీ మొదలెట్టిన రెండు సినిమాలు ముందుకు కదలకపోవడంతో అప్పులపాలయ్యారని తెలుస్తోంది. ఆదాయం లేకపోయినా, శ్రీదేవి [...]

అమ్మ పాత్రకు సిద్ధమవుతున్న ఐశ్వర్య!

అమ్మ పాత్రకు సిద్ధమవుతున్న ఐశ్వర్య! బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం చాలా చాలా హ్యాపీగా వున్నాడు. ఆనందంతో ఎగిరిగంతేస్తున్నాడు కూడా. దీనికి కారణం… త్వరలో తాను తాత కాబోతున్నాడు. కోడలు ఐశ్వర్యా రాయ్ త్వరలో తల్లికాబోతోంది. ఈ విషయాన్ని అమితాబే స్వయంగా చెప్పాడు. “అవును… నేను తాత అవుతున్నాను… ఐశ్వర్య తల్లి కాబోతోంది” అంటూ పొంగిపోతున్నాడు. ఇప్పుడీ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే, ఇంతవరకు ఐశ్వర్య ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదు. [...]

అభిషేక్ బచ్చన్ తో పూరీ ‘బిజినెస్ మేన్’

అభిషేక్ బచ్చన్ తో పూరీ ‘బిజినెస్ మేన్’ ‘పోకిరీ’ తర్వాత మళ్లీ చాలా కాలానికి మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం మనకు తెలుసు. ‘ది బిజినెస్ మేన్’ పేరుతో ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ నిర్మిస్తున్నారు. వచ్చే నెలాఖరుకి ఈ షూటింగును ప్రారంభించడానికి ప్లాన్ జరుగుతోంది. ఇందులో కథానాయికగా కాజల్ ని ఎంపిక చేశారు. తమన్ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంచితే, [...]

మహిళా సాంకేతిక నిపుణుల ప్రేమకథ

మహిళా సాంకేతిక నిపుణుల ప్రేమకథ తొలిసారిగా పూర్తి మహిళా సాంకేతిక నిపుణులతో తెలుగులో ఓ చిత్రం రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దగ్గర పనిచేసిన హైమారెడ్డి స్వీయ దర్శకత్వంలో దీనిని నిర్మిస్తున్నారు. ఆస్ట్రేలియాలో డిజిటల్ ఫిలిం మేకింగ్ కోర్స్ చేసిన హైమ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అలాగే, ప్రముఖ గాయని కౌసల్య సంగీతాన్ని సమకూరుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభం కానున్న ఈ సినిమా లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. [...]

మ్యూజిక్ సిటింగ్స్ లో ‘గబ్బర్ సింగ్’

మ్యూజిక్ సిటింగ్స్ లో ‘గబ్బర్ సింగ్’ ప్రస్తుతం కోల్ కతాలో ‘కాళీ’ చిత్రం షూటింగులో బిజీగా వున్న పవన్ కల్యాణ్, దీని తర్వాత ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘మిరపకాయ్’ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ కూడా పూర్తి చేశారు. హిందీ చిత్రం ‘దబాంగ్’ రీమేక్ గా దీనిని నిర్మిస్తున్నప్పటికీ తెలుగు నేటివిటీకి, పవన్ కల్యాణ్ ఇమేజ్ కీ అనుగుణంగా కథను పూర్తిగా మార్చినట్టు [...]

Photo Gallery

All Rights Reserved Kasepu.Com